రాజస్థాన్ గవర్నర్ కల్రాజ్ మిశ్రా కరోనా బారిన పడ్డారు. ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణైంది. గవర్నర్‌కు ఒళ్లు నొప్పులు రావడంతో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. దీంతో ఆయనకు పాజిటివ్‌గా తేలినట్లు రాజ్‌భవన్ వర్గాలు అధికారికంగా వెల్లడించాయి. గవర్నర్‌తో సన్నిహితంగా ఉన్నవారు, ఆయన్ని కలిసిన అధికారులు, ప్రజాప్రతినిధులు కరోనా పరీక్షలు చేయించుకోవాలని రాజ్‌భవన్ వర్గాలు ఓ ప్రకటంచాయి. కరోనా పట్ల అజాగ్రత్తగా ఉండవద్దని..తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలపడం జరిగింది. కరోనా నిబంధనలు పాటించాలని..వైరస్ లక్షణాలు గుర్తించినా, లేక అనుమానం వచ్చినా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని రాజ్‌భవన్ తన ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే రాజస్థాన్ సీఎం అశోక్‌గెహ్లాట్, మాజీ సీఎం వసుందరా రాజేకు కరోనా పాజిటివ్ రావడంతో హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు.
రాజస్థాన్ గవర్నర్ కు కరోనా పాజిటివ్ !
April 14, 2023
0
Tags