దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో పుదుచ్చేరి కూడా ఒకటి. గోవా తరహాలో పుదుచ్చేరి యువతను ఎక్కువగా ఆకర్షిస్తున్న పర్యాటక ప్రాంతం ఉంది. ఈ క్రమంలో పుదుచ్చేరి ఓ కీలక నిర్ణయం తీసుకుంది. మందుబాబులను ఆకర్షించేందుకు కాటమరాన్ బ్రూయింగ్ కంపెనీ బీర్ బస్సును ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఈ సర్వీస్ చెన్నై నుండి పుదుచ్చేరికి మాత్రమే అందించబడుతుంది. తాజాగా కాటమరాన్ బ్రూయింగ్ కంపెనీ హాప్ ఆన్ బ్రూవరీ టూర్ బస్సు లేదా బీర్ బస్సును ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఈ బస్సులను ఏప్రిల్ 22న పరిచయం చేయడానికి సిద్ధంగా ఉంది. ఇది కూడా వీకెండ్ లో చెన్నై నుండి పుదుచ్చేరికి ఒక రోజు ప్యాకేజీ. ఈ ప్యాకేజీలో 120 నిమిషాల పాటు అపరిమిత బీర్ సేవలతో పాటు రుచికరమైన భోజనం మూడు పూట అందించనున్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. టూరిస్ట్ లో వారు ఎంపిక చేసుకున్న ప్రాంతాల ఆధారంగా ఒకటి లేదా రెండు ప్రదేశాలకు తీసుకెళ్తారు. ఈ బీర్ బస్సులు శని, ఆదివారాల్లో మాత్రమే నడుస్తాయి. 35 నుండి 40 మంది పర్యాటకుల బృందాన్ని చెన్నైలోని ఒక ప్రాంతం నుండి ఉదయం 10.30 గంటలకు బయలుదేరి అదే రోజు రాత్రి 9 గంటలకు తిరిగి చెన్నైకి చేరుస్తారు. ప్రభుత్వ నిబంధనలు ప్రకారం బస్సు ప్రయాణ సమయంలో బీరు అందించబడదు. అయితే ఇది పుదుచ్చేరిలోని బ్రూవరీలో అందించబడుతుందని సంస్థ ధృవీకరించింది.
కాటమరాన్ బ్రూయింగ్ కంపెనీ హాఫ్ ఆన్ బ్రూవరీ టూర్ బస్సు !
April 14, 2023
0
Tags