గ్రేటర్‌ నోయిడాలో భారీ అగ్నిప్రమాదం

Telugu Lo Computer
0


ఢిల్లీ సమీపంలోని గ్రేటర్‌ నోయిడాలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. నోయిడాలోని గౌర్‌ సిటీలో గల 14 అవెన్యూ సొసైటీ లోని రెసిడెన్షియల్‌ టవర్స్‌ లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. రెసిడెన్షియల్‌ కాంప్లెక్స్‌లోని రెండో అంతస్తులో మంటలు చెలరేగి అవి పై అంతస్తు వరకు వ్యాపించినట్లు తెలుస్తోంది. భారీగా మంటలు ఎగసిపడుతుండటంతో అప్రమత్తమైన సొసైటీ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో వారు స్థానిక పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఎవరికీ ఎటువంటి గాయాలు అయినట్లు సమాచారం లేదు. 

Post a Comment

0Comments

Post a Comment (0)