'సౌరాష్ట్ర తమిళ సంగమం' ముగింపు కార్యక్రమం సందర్భంగా సోమనాథ్ సంస్కృత విశ్వవిద్యాలయం రచించిన 'సౌరాష్ట్ర తమిళ సంగం ప్రశస్తి' అనే పుస్తకాన్ని ప్రధాని మోడీ బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. 'దేశంలోని వివిధ ప్రాంతాలలోని ప్రజల మధ్య పురాతన సంబంధాలను వెలికితీసేందుకు ఈ కార్యక్రమాలు దోహదపడతాయి. ఈ కార్యక్రమాల ద్వారా ఏక్ భారత్ శ్రేష్ట భారత్ స్ఫూర్తిని ప్రజల్లో నింపాలనేది మోడీ దృష్టిలో ఉంది. అందుకే మొదటగా కాశీ తమిళ సంగమాన్ని నిర్వహించారు. గుజరాత్, తమిళనాడుల మధ్య సంస్కృతి, వారసత్వాన్ని ఈ సౌరాష్ట్ర తమిళ సంగమం ముందుకు తీసుకెళుతుంది. శతాబ్దాల క్రితం గుజరాత్‌లోని సౌరాష్ట్ర ప్రాంతం నుంచి చాలామంది తమిళనాడుకు వలస వచ్చారు. ఈ సౌరాష్ట్ర తమిళ సంగమంతో తమిళనాడులో ఉన్న సౌరాష్ట్ర ప్రాంతం వారు మళ్లీ వాళ్ల పురాతన సంస్కృతికి కనెక్ట్ అయ్యే అవకాశం ఉందని ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటనలో పేర్కొంది. కాగా, 10 రోజులపాటు సాగిన ఈ సంగమం కార్యక్రమానికి మూడువేల మంది సౌరాష్ట్ర తమిళీయులు ప్రత్యేక రైళ్లలో సోమనాథ్‌కి వచ్చినట్లు మీడియావర్గాలు పేర్కొన్నాయి.
సౌరాష్ట్ర - తమిళ సంగం ప్రశస్తి పుస్తకాన్ని ఆవిష్కరించిన ప్రధాని
April 26, 2023
0
Tags