కరెంట్‌ షాక్‌కు గురై భార్య, భర్తల మృతి

Telugu Lo Computer
0


తెలంగాణలోని మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని లైన్ గడ్డ ప్రాంతం లో కుటుంబంతో కలిసి నివాసముంటున్న బొల్లంపల్లి శ్రీనివాస్ స్వర్ణకారుడు. ఇటీవల ఆయన పట్టణ స్వర్ణకార సంఘం అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. విద్యుత్ షాక్ తగిలి శ్రీనివాస్ అతని భార్య లత మృత్యువాతపడ్డారు. నిన్న అర్థరాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది.  ఈ క్రమంలో ఇంటి ఆవరణలో పేరుకపోయిన ధుమ్ము ధూళిని శుభ్రం చేసేందుకు లత శుక్రవారం ఉదయం కరెంటు మోటారు వేసి నీటితో దుమ్ము ధూళి పట్టిన వస్తువులను కడుగుతున్నారు. ఈ సమయంలో షాట్ సర్క్యూట్ తగిలి విద్యుత్ ఘాతానికి గురైన లత అరవడంతో ఇంట్లో ఉన్న శ్రీనివాస్ తన భార్యను కాపాడాలన్న ఆతృతలో ఆమెను పట్టుకున్నాడు. దీంతో ఆ దంపతులు ఇద్దరు కూడా విద్యుత్ షాక్ కు గురై అక్కడికక్కడే చనిపోయారు.  చెన్నూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)