జుట్టు ఎందుకు నెరుస్తుందన్నది అనే దీనిపై శాస్త్రవేత్తల పరిశోధన !

Telugu Lo Computer
0


అమెరికాలోని ఎన్‌వైయూ గ్రాస్‌మన్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌కు చెందిన శాస్త్రవేత్తలు వయసు మీదపడేకొద్దీ జుట్టు ఎందుకు నెరుస్తుందన్నది అనే దీనిపై  పరిశోధన చేశారు. వీరు ఎలుకలు, మానవుల చర్మంలో ఉండే మెలనోసైట్‌ మూలకణాల (ఎంసీఎస్‌సీలు)ను పరిశీలించారు. వెంట్రుకలు పెరిగే క్రమంలో ఈ కణాలు కుదుళ్లలోని వివిధ కంపార్ట్‌మెంట్ల మధ్య రాకపోకలు సాగిస్తాయి. ఆ క్రమంలో ఎదురయ్యే ప్రొటీన్‌ సంకేతాల కారణంగా వాటి పరిపక్వ దశలోనూ మార్పులు వస్తాయి. తొలుత ప్రారంభ దశలో ఉండే ఈ కణాలు  ట్రాన్సిట్‌-యాంప్లిఫయింగ్‌ స్థితికి రూపాంతరం చెందుతాయి. వయసు మీద పడేకొద్దీ ఈ ఎంసీఎస్‌సీలు 'హెయిర్‌ ఫాలికల్‌ బల్జ్‌' అనే మూలకణ గదిలోనే చిక్కుకుపోతాయి. ఫలితంగా అవి ట్రాన్సిట్‌-యాంప్లిఫయింగ్‌ దశకు పరిపక్వం చెందలేవు. తమ పూర్వ ప్రదేశంలోకీ వెళ్లవు. అక్కడికి వెళ్తేనే అవి పిగ్మెంట్‌ కణాలుగా పునరుత్థానం చెంది, వెంట్రుకల రంగును కొనసాగించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. మానవుల్లోనూ ఇదే తరహా ప్రక్రియ జరుగుతున్నట్లు నిర్ధారణ అయితే హెయిర్‌ ఫాలికల్‌ బల్జ్‌లో చిక్కుకుపోయిన కణాలను మళ్లీ వివిధ కంపార్ట్‌మెంట్ల మధ్య కదిలేలా చేయవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)