నవీన్ యెర్నేనికి అస్వస్థత

Telugu Lo Computer
0


మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మాతలు నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి స్టార్ హీరోలతో సినిమాలు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది సంక్రాంతికి ఒకరోజు వ్యవధిలోనే మెగాస్టార్ చిరంజీవితో వాల్తేరు వీరయ్య, నటసింహం బాలకృష్ణతో వీర సింహా రెడ్డి సినిమాలను విడుదల చేసి బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టారు. అంతకుముందే 2021లో అల్లు అర్జున్ తో 'పుష్ప: ది రైజ్' సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో బంపర్ హిట్ అందుకున్నారు.  ప్రస్తుతం 'పుష్ప: ది రూల్' చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు నిర్మాతలు నవీన్, రవిశంకర్. ఈ చిత్రాన్ని సుమారుగా రూ. 400 కోట్ల బడ్జెట్ తో రూపొందిస్తున్నట్లు సమాచారం. అయితే ఇటీవల మూడు రోజులుగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. వీరితోపాటు డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో కూడా సోదాలు జరుపుతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ సుమారుగా రూ. 700 కోట్ల వరకు వివిధ రూపాల్లో నగదు సమకూర్చుకుని జీఎస్టీ సరిగా కట్టలేదనే ఆరోపణలు ఉన్నాయి. అందుకే ఆ కేసు విషయంలో ఐటీ అధికారులు విచారిస్తున్నట్లు సమాచారం. ఐటీ దాడులతో పుష్ప 2 షూటింగ్ ఆగిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా నవీన్ యెర్నేని అస్వస్థకు గురయ్యారు. గురువారం రాత్రి ఆయనకు ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. దీంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రిలో చేరిన నవీన్ యెర్నేనీకి వైద్యులు మెరుగైన చికిత్స్ అందిస్తున్నారు. అయితే ప్రస్తుతం బడా నిర్మాత నవీన్ యెర్నేని ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆందోళన చెందాల్సిన పని లేదని కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు. కానీ నవీన్ యెర్నేనీ అస్వస్థకు గురి కావడం సినీ ఇండస్ట్రీలో కలకలం సృష్టించింది. ఐటీ దాడుల వల్లే ఆయన ఆరోగ్యం దెబ్బ తిందని పలువురు అనుమానిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)