కట్టప్ప పాత్ర బలంగా లేదని వదులుకున్నసంజయ్‌ దత్‌

Telugu Lo Computer
0


ప్రభాస్‌ హీరోగా దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో చూశాం. ఈ సినిమాలో రానా, అనుష్క, రమ్యకృష్ణ పాత్రలతో పాటు కీలకమైంది సత్యరాజ్‌ పోషించిన కట్టప్ప క్యారెక్టర్‌. బాహుబలికి తోడుగా ఉన్న కట్టప్ప చివరికి అతన్ని చంపడం 'బాహుబలి' మొదటి భాగం సినిమాకు ఆసక్తికర ముగింపు ఇచ్చింది. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే ప్రశ్న ద్వితీయ భాగంపై ఉత్సుకత పెంచింది. ఈ ప్రశ్న దేశవ్యాప్తంగా వైరల్‌ అయ్యింది. ఈ కట్టప్ప క్యారెక్టర్‌ కోసం మొదట సంజయ్‌ దత్‌ను సంప్రదించాడట దర్శకుడు రాజమౌళి. స్క్రిప్ట్‌ విన్న సంజయ్‌ దత్‌ కట్టప్ప పాత్ర అంత బలంగా లేదని భావించి ఈ ఆవకాశాన్ని వదులుకున్నాడు. తర్వాత ఆ పాత్ర సత్యరాజ్‌కు దక్కింది. సత్యరాజ్‌ కెరీర్‌లోనే ఒక మైల్‌స్టోన్‌గా నిలిచింది. ఈ విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సంజయ్‌దత్‌ వెల్లడించారు. అయితే 'కేజీఎఫ్‌’లో అధీరా పాత్రతో సంజయ్‌ దత్‌ అదే స్థాయి గుర్తింపు తెచ్చుకున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)