ఆర్జిత సేవలు, ప్రత్యేక ప్రవేశ దర్శనం షెడ్యూల్‌ విడుదల

Telugu Lo Computer
0


తిరుమల తిరుపతి దేవస్థానం ఆర్జిత సేవలు, ఎలక్ట్రానిక్‌ డిప్‌, ప్రత్యేక ప్రవేశ దర్శనం, వసతి గదుల కోటా విడుదలకు సంబంధించిన షెడ్యూల్‌ను ప్రకటించింది. ఇంతకు ముందు ఆయా సేవలకు సంబంధించి ఎప్పుడు విడుదల చేయనున్నదో ఆయా తేదీలను వేర్వేరుగా ప్రకటించేది. తాజాగా ఒకేసారి క్యాలెండర్‌ను ప్రకటించింది. ఈ మేరకు భక్తులు ఆన్‌లైన్‌లో టికెట్లను బుక్‌ చేసుకొని.. సహకరించాలని విజ్ఞప్తి చేసింది. జూలై మాసానికి సంబంధించి ఆర్జిత సేవా టికెట్ల కోటాను ఏప్రిల్‌ 20వ తేదీ ఉదయం 10 గంటల నుంచి అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది. రిజిస్ట్రేషన్‌ 22న ఉదయం 10 గంటల వరకు అందుబాటులో ఉంటుందని పేర్కొంది. అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు డిప్‌ అలాట్‌మెంట్‌ను ప్రకటించనున్నట్లు పేర్కొంది. జూలై మాసానికి సంబంధించిన కల్యాణం, ఊంజల్‌ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సహా తదితర ఆర్జిత సేవా టికెట్ల కోటాను ఈ నెల 20న ఉదయం 11.30 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు టీటీడీ తెలిపింది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవాణి ట్రస్ట్‌ టికెట్లు విడుదల చేయనున్నట్లు చెప్పింది. జూలై నెలకు సంబంధించిన అంగ ప్రదక్షిణం టోకెన్లను ఈ నెల 21న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు చెప్పింది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు దివ్యాంగులు, వృద్ధులకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం కోటాను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు చెప్పింది. మే, జూన్‌ మాసాలకు సంబంధించి వర్చువల్‌ కల్యాణోత్సవం, ఊంజల్‌ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవల టికెట్ల కోటాను 24న ఉదయం 10 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలిపింది. మే మాసానికి సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను 25న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. మే నెలకు సంబంధించి తిరుమలలో వసతి గదుల కోటాను ఈ నెల 26న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు టీడీపీ వెల్లడించింది. 27న తిరుపతిలోని వసతి గదుల కోటాను విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వివరించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)