ఢిల్లీ మెట్రో రైలులో బహిరంగంగా హస్తప్రయోగం చేసుకున్న వ్యక్తిపై పోలీసులు కేసు

Telugu Lo Computer
0


ఢిల్లీ మెట్రోరైలు ఎక్కిన ఓ వ్యక్తి బహిరంగంగా హస్తప్రయోగం చేశాడు. ఈ ఘటన జరిగినపుడు రైలులో తోటి ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురై దూరంగా వెళ్లడం వీడియోలో కనిపించింది. ఈ దారుణ ఘటనను మరో ప్రయాణికుడు తన ఫోన్ ద్వారా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ నోటీసు జారీ చేశారు. దీంతో ఢిల్లీ పోలీసులు ఐపీసీ సెక్షన్ 294 కింద కేసు నమోదు చేశారు. హస్తప్రయోగం చేసిన వ్యక్తి ఆచూకీ ఇంకా తెలియలేదు. ఈ వీడియోపై ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ స్పందిస్తూ,''ఈ పని పూర్తిగా అసహ్యకరమైనది, బాధాకరమైనది''అని అభివర్ణించారు నిందితుడిపై చర్యలు తీసుకోవాలని స్వాతి డిమాండ్ చేశారు.ఆమె ఒక ట్వీట్‌లో ''ఢిల్లీ మెట్రోలో ఒక వ్యక్తి సిగ్గు లేకుండా హస్తప్రయోగం చేస్తున్న వీడియో వైరల్‌గా కనిపించింది. ఇది పూర్తిగా అసహ్యకరమైనదిఈ సిగ్గుమాలిన చర్యకు వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీసులకు, ఢిల్లీ మెట్రోకు నేను నోటీసు జారీ చేస్తున్నాను.''అని స్వాతి మలివాల్ ఒక ప్రకటన విడుదల చేసింది.దీంతో మెట్రోలో ఫ్లయింగ్ స్క్వాడ్‌ల మోహరిస్తామని ఢిల్లీ మెట్రో అధికారులు చెప్పారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)