స్విగ్గి ఆర్డర్ వ్యాల్యూతో సంబంధం లేకుండా రూ. 2 'ప్లాట్‌ఫారమ్ ఫీజు' వసూలు చేయనుంది. స్విగ్గి ప్రధాన ప్లాట్‌ఫారమ్‌లోని చేసే ఫుడ్ ఆర్డర్‌లపై మాత్రమే ఈ అదనపు ఛార్జీలు విధించబడుతున్నామని, ఇన్‌స్టామార్ట్ నుండి చేసే వినియోగదారులకు ఈ చార్జెస్ వర్తించవని కంపెనీ తెలిపింది. ఈ చార్జెస్ కూడా.. తమ ప్లాట్‌ఫారమ్‌ను ఆపరేట్ చేయడానికి, వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెయింటైన్ చేయడానికి, యాప్ ఫీచర్‌లను మెరుగుపరచడానికి మాత్రమే వినియోగిస్తామని' స్విగ్గీ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. రోజుకి 1.5 నుండి 2 మిలియన్ ఆర్డర్‌లను ప్రాసెస్ చేస్తున్నామని, హైదరాబాద్ ప్రజలు రంజాన్ పండుగ సందర్భంగా స్విగ్గీలో 10 లక్షల బిర్యానీలు, 4 లక్షల ప్లేట్ల హలీమ్‌లను ఆర్డర్ చేశారని తెలిపారు. గడిచిన 12 నెలల్లో స్విగ్గి 33 మిలియన్ ప్లేట్ల ఇడ్లీలను డెలివరీ చేసిందని, ఈ డిష్‌కు కస్టమర్‌లలో అపారమైన ఆదరణ ఉందని సూచించింది.
ప్రతి ఆర్డర్ పై రూ.2 వసూలు !
April 29, 2023
0
Tags