హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఆయన ప్రయాణిస్తున్న టయోటా ల్యాండ్ క్రూయిజర్ ఆదివారం హిసార్‌లో ప్రమాదానికి గురి అయింది. హర్యానాలోని హిస్సార్ జిల్లాలోని బర్వాలా సమీపంలో 'నీల్‌గై' భూపిందర్ సింగ్ ఎస్‌యూవీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. అయితే ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడంతో భూపిందర్ సింగ్ హుడా బయటపడ్డారు. భూపిందర్ హుడా హిసార్‌లోని గిరాయే గ్రామంలో బాక్సర్ సావీటీ బూరాను సన్మానించేందుకు వెళుతుండగా వాహనాన్ని నీల్‌గాయ్‌ను ఢీకొట్టింది. ప్రమాదానికి సంబంధించిన చిత్రాల్లో ముందు రెండు ఎయిర్ బ్యాగ్‌లు ఓపెన్ అయినట్లు కనిపిస్తున్నాయి. ప్రమాదం తర్వాత భూపిందర్ సింగ్ తన కాన్వయ్ లోని మరో వాహనంలో ఎక్కి వెళ్లిపోయారు. హుడా బాగానే ఉన్నాడని, షెడ్యూల్ చేసిన కార్యక్రమాలకు హాజరయ్యాడని భూపిందర్ సింగ్ హుడా సలహాదారు సునీల్ తెలిపారు. వాహనం దెబ్బతింది కానీ అందులో ఉన్న వారందరూ క్షేమంగా ఉన్నారని చెప్పారు. ఈ ప్రమాదంలో టయోటా వాహనం ముందు బంపర్ దెబ్బతింది. "ఒక నీలగై అకస్మాత్తుగా రోడ్డుపై కనిపించి మిస్టర్ హుడా వాహనాన్ని ఢీకొట్టింది. అయితే, అతను క్షేమంగా బయటపడ్డాడు. వాహనంలో ఉన్న ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు" అని హిసార్ పోలీసు సూపరింటెండెంట్ గంగా రామ్ పునియా పిటిఐకి తెలిపారు. "మృగం మా వాహనాన్ని ఢీకొట్టింది, కానీ అందరూ సురక్షితంగా ఉన్నారు. నేను నా కార్యక్రమాలను కొనసాగిస్తున్నాను " భూపిందర్ సింగ్ హుడా తెలిపారు.
భూపిందర్ సింగ్ హుడాకు త్రుటిలో తప్పిన ప్రమాదం
April 09, 2023
0
Tags