దేశాన్ని స్వచ్ఛ భారత్‌గా మలచడంలో వీరే అసలైన హీరోలు !

Telugu Lo Computer
0


కర్నాటకలోని బస్టాండ్‌లో పరిసరాలను శుభ్రం చేస్తున్న మహిళ వీడియోను పారిశ్రామికదిగ్గజం ఆనంద్ మహీంద్రా రీట్వీట్ చేశారు. అంకోలా బస్టాండ్‌లో పండ్లు అమ్ముకునే మహిళ తన కస్టమర్లు విసిరిపారేసిన ఆకులను ఏరి డస్ట్‌బిన్‌లో పడేస్తుంటారు. ఆకుల్లో పండ్ల ముక్కలను సదరు మహిళ అమ్ముతుంటుందని తొలుత ఈ వీడియోను షేర్ చేసిన ఆదర్శ్ హెగ్డే రాసుకొచ్చారు. బస్‌స్టాండ్ ప్రాంగణంలో జనం విసిరేసిన ఆకులను ఓపికగా ఏరి డస్ట్‌బిన్‌లో మహిళ పడేస్తున్న తీరుకు హెగ్డేతో పాటు ఆనంద్ మహీంద్రా ముగ్ధులయ్యారు. బస్‌స్టాండ్‌లో కనిపించిన మహిళ వివరాలు కావాలని ఆనంద్ మహీంద్రా కోరారు. దేశాన్ని స్వచ్ఛ భారత్‌గా మలచడంలో వీరే అసలైన హీరోలని, ఆమె చేస్తున్న పని తెరమరుగు కారాదని, ఆమె ప్రశంసలకు అర్హురాలని మహీంద్ర గ్రూప్ చీఫ్ మహిళ వీడియోను షేర్ చేస్తూ రాసుకొచ్చారు. మహిళను ప్రశంసించిన పలువురు యూజర్లు తమ ప్రాంతంలో తమకెదురైన అనుభవాల గురించి కూడా కామెంట్స్ సెక్షన్‌లో రాసుకొచ్చారు. సమాజంలో సంపన్న వర్గంతో పోలిస్తే బలహీన, పేద వర్గాలకు చెందిన వారిలో సమాజం పట్ల తపన, బాధ్యత అధికంగా కనిపిస్తాయని ఓ యూజర్ కామెంట్ చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)