బీహార్ రాజధాని పాట్నాలో సినీ ఫక్కీలో ఏటీఎమ్ లో నింపాల్సిన నగదుతో వ్యాన్ డ్రైవర్ ఉడాయించాడు. ఐసీఐసీఐ బ్యాంక్ ఏటీఎమ్‌లో నగదును నింపేందుకు సెక్యూలర్ వాల్యూ ఇండియా కెంపెనీకి చెందిన సిబ్బంది వ్యాన్ లో ఏటీఎమ్ వద్దకు చేరుకున్నారు. ఈ సమయంలో వ్యాన్ లో ఉన్న ఓ గన్ మెన్, సంస్థ ఆడిటర్ కిందకు దిగి కాస్త దూరం వెళ్ళారు. అదే అదును చూసిన డ్రైవర్ రూ.1.5 కోట్ల నగదు ఉన్న వ్యాన్‌తో పారిపోయాడు. వెంటనే పోలీసులకు మిగతా సిబ్బంది సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు వ్యాన్ జీపీఎస్ ఆధారంగా గాలింపు చేపట్టారు. చివరకు ఎన్ఎమ్ సీహెచ్ రోడ్డు పక్కన వ్యాన్‌ను గుర్తించారు. అయితే డబ్బులు, డ్రైవర్ మాత్రం కనబడలేదు. వ్యాన్ నుంచి డబ్బులు తీసుకొని ఓ కారులో డ్రైవర్ పారిపోయినట్లు పోలీసులు వెల్లడించాడు. డ్రైవర్ సురజ్ కుమార్‌గా గుర్తించి అతడి కోసం గాలిస్తున్నారు. మొత్తం చోరీ అయినా సొమ్మ రూ. 1.5 కోట్లగా తెలుస్తోంది.
రూ.1.5 కోట్లతో ఏటీఎమ్ వ్యాన్ డ్రైవర్ పరార్ !
April 11, 2023
0
Tags