మొఘలుల చరిత్ర తొలగింపు !

Telugu Lo Computer
0


స్కూల్ ఎడ్యుకేషన్ సిలబస్‌లోని భారతీయ చరిత్ర ప్రస్థానంలో భారత రాజులు, రాజ్యాల ప్రాధాన్యం తగ్గిందనే వాదన ఎప్పటి నుంచో ఉంది. మనపై దండయాత్రలు చేసిన రాజులు, రాజ్యాలకు చరిత్రలో పెద్దపీట వేశారని చాలామంది భావిస్తున్నారు. ఈ క్రమంలో నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ కీలక నిర్ణయం తీసుకుంది. 12వ తరగతి చరిత్ర సిలబస్‌లో కొన్ని మార్పులు, చేర్పులు చేసింది. ఇందులో భాగంగా మొఘలులకు సంబంధించిన పాఠ్యాంశాన్ని పూర్తిగా తొలగించింది. దీంతో పాటు 10, 11తరగతులకు చెందిన వివిధ సబ్జెక్టుల్లోనూ కొన్ని టాపిక్‌లను సవరించింది. ఫలితంగా ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌ని ఫాలో అయ్యే బోర్డులు పాఠ్యాంశాల్లో మార్పులు చేయాల్సి ఉంటుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ , ఇతర ఎడ్యుకేషన్ బోర్డులు ఎన్సీఈఆర్టీ  సిలబస్‌ ఫాలో అవుతున్నాయి. 12వ తరగతికి చెందిన 'థీమ్స్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ- పార్ట్2' పుస్తకంలో నుంచి 'కింగ్స్ అండ్ క్రానికల్స్; ద మొఘల్ కోర్ట్స్' చాప్టర్‌ను ఎన్‌సీఈఆర్‌టీ పూర్తిగా తొలగించింది. మొఘలుల రాజ్య స్థాపన, పాలనా విధానం, ఆధునిక భారత దేశ చరిత్రలో మొఘలుల పాత్ర గురించి ఈ చాప్టర్ వివరిస్తుంది. 2023-24 అకాడమిక్ ఇయర్ నుంచి ఈ సవరణలను అమలు చేయనున్నారు. ఫలితంగా హిస్టరీ సిలబస్‌లో మొఘలల చాప్టర్‌కి పూర్తిగా గుడ్ బై చెప్పినట్లే. 12వ తరగతితో పాటు 11వ తరగతికి చెందిన చరిత్ర పాంఠ్యాంశాలను కూడా ఎన్‌సీఈఆర్‌టీ సవరించింది. 'థీమ్స్ ఇన్ వరల్డ్ హిస్టరీ'లోని 'సెంట్రల్ ఇస్లామిక్ ల్యాండ్స్', 'కన్‌ఫ్రంటేషన్ ఆఫ్ కల్చర్స్', 'ద ఇండస్ట్రియల్ రెవల్యూషన్' చాప్టర్‌లను తొలగించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)