పెళ్లి కానుకగా వచ్చిన హోమ్ థియేటర్ పేలి వరుడు మృతి !

Telugu Lo Computer
0

ఛత్తీస్‌గఢ్‌లో పెళ్లి కానుకగా వచ్చిన హోమ్ థియేటర్ పేలిపోయి వరుడు, ఒక బంధువు చనిపోయారు. పెళ్లయిన మూడో రోజే ఈ విషాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. కవర్ధా జిల్లా రెంగాఖర్ బ్లాకులో చమరి గ్రామానికి చెందిన హిమేంద్ర మరావీకి శుక్రవారం పెళ్లయింది. అతని పెళ్లి బహుమతి కింద హోమ్ థియేటర్ వచ్చింది. ఆదివారం దాన్ని ఇన్‌స్టాల్ చేసి కరెంట్ కనెక్షన్ ఇస్తుండగా ఒక్కసారిగా ఢామ్మని పేలిపోయింది. ఇంటిపైకప్పు కూడా ధ్వంసంమైంది. హిమేంద్రతోపాటు మరో బంధువు అక్కడికక్కడే చనిపోయారు. గాయపడినవారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించ చికిత్స అందిస్తున్నారు. భర్త చనిపోవడంతో నవ వధువు కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)