ఉత్తర ప్రదేశ్ కి చెందిన అయాన్ గుప్తా అనే 10 ఏళ్ల బాలుడు టెన్త్ క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ లో 76.67 పర్సెంటేజ్ సాధించి రికార్డు క్రియేట్ చేశాడు. అంతేకాదు అయాన్ డిస్టింక్షన్ తో పాస్ కావడంతో తల్లిదండ్రులు సంతోషంలో మునిగిపోతున్నారు. వాస్తవానికి యూపీ బోర్డు నియమం ప్రకారం టెన్త్ ఎగ్జామ్స్ లో హాజరు కావడానికి కనీసం వయసు 14 సంవత్సరాలు ఉండాలి. కానీ అయాన్ వయసు మాత్రం పది సంవత్సరాలు కావడంతో పాఠశాల ప్రిన్సిపల్ బోర్డు నుంచి ప్రత్యేక అనుమతి తీసుకుని పరీక్షలు రాయించారు. గ్రేటర్ నోయిడా కు చెందిన అయాన్ గుప్తా తండ్రి చార్టర్డ్ అకౌంటెంట్. తల్లి సవితా గుప్తా గృహిణి. భార్యాభర్తలు ఇద్దరూ ఉన్నత చదువు చదివినవారు కావడంతో అయాన్ చిన్నప్పటి నుంచి చదువు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చారు. చిన్నప్పటి నుంచి అయాన్ చదువుకు సంబంధించిన అన్ని సందేహాలను నివృతి చేసేవారు తల్లిదండ్రులు. ఇక కరోనా సమయంలో ఇంటి వద్దనే ఉండటంతో అయాన్ తన పాఠ్య పుస్తకాలను పక్కనబెట్టి ఉన్నత చదువులకు సంబంధించిన పుస్తకాలను చదవడం ప్రారంభించాడు. అయాన్ కి ఇంట్లో ట్యూషన్ చెప్పిస్తూ.. తన కోరిక మేరకు టెన్త్ బోర్డ్ ఎగ్జామ్ రాయించాలని అప్పట్లోనే నిర్ణయం తీసుకున్నామని తల్లిదండ్రులు అంటున్నారు. ఇందుకోసం స్కూల్ ప్రిన్సిపల్ తో బోర్డు అనుమతి తీసుకోవాల్సిందిగా కోరామని.. అయన అనుమతి తీసుకొని అయాన్ టెన్త్ ఎగ్జామ్స్ రాసేలా చేశారని అన్నారు. తమ కొడుకు డిస్టింక్షన్ లో పాస్ కావడం చాలా సంతోషంగా ఉందని అంటున్నారు అయాన్ తల్లిదండ్రులు. అయాన్ ఇంజనీర్ కావాలన్నదే అతని కోరిక.. ఇందుకోసం జేఈఈ లాంటి ఇతర ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కి సిద్దం అవుతున్నట్లు తెలిపారు.
పదేళ్లకే టెన్త్ డిస్టింక్షన్‌లో పాస్ !
April 27, 2023
0
Tags