కేరళలోని కొచ్చిలో ప్రధాని మోడీ మెగా రోడ్‌షో నిర్వహించారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ సాయంత్రం 5 గంటలకు కొచ్చిలోని నౌకాదళ ఎయిర్ స్టేషన్‌లో దిగారు. అనంతరం. రోడ్డుమార్గంలో నడుస్తూ మద్దతుదారులను ఉత్సాహపరిచారు. కేరళ సంప్రదాయ దుస్తులు ధరించి, ఐఎన్ఎస్ గరుడ నావల్ ఎయిర్ స్టేషన్ నుంచి యువజన కార్యక్రమ వేదికవరకు 2 కి.మీ మేర రోడ్డుమార్గంలో ఇరువైపులా వేచి వున్న ప్రజలకు అభివాదం చేస్తూ ప్రధాని మోదీ ఉత్సాహంగా కనిపించారు. కొచ్చిలో ప్రధాని మోదీ పర్యటిస్తున్న ప్రాంతంలో వేలాది మంది పోలీసులను మోహరించి భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. కేరళలో ప్రధాని రోడ్‌షో పార్టీ వర్గాల్లో ఉత్సాహాన్ని నింపాయి. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో పాగా వేయాలని భావిస్తున్న నేపథ్యంలో ప్రధాని రోడ్‌షో పార్టీ శ్రేణుల్లో మరింత ఆత్మవిశ్వాసాన్ని నింపింది. గత కొన్ని నెలలుగా, బిజెపి అధిష్టానం కేరళపై ప్రత్యేక దృష్టి సారించింది. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రకటించడమే కాకుండా రాష్ట్రంలోని కొన్ని సీట్లపై ప్రభావం చూపే క్రైస్తవ, ముస్లిం వర్గాలను మచ్చిక చేసుకుంటోంది.
కొచ్చిలో ప్రధాని మోదీ మెగా రోడ్‌షో !
April 24, 2023
0
Tags