హైదరాబాద్ లో ఓ వ్యక్తి చేతిలో మోసపోయి గర్భం దాల్చిన ఓ మహిళ హుస్సేన్ సాగర్ లో దూకి ఆత్మహత్యకు యత్నించింది. సాగర్ లోకి దూకేలోపే గమనించిన లేక్ పోలీసు ఆమెను కాపాడారు. రాజశేఖర్ అనే వ్యక్తి తనను పెళ్లి చేసుకుంటానన్న నమ్మించి లైంగికంగా వాడుకున్నాడని ఆరోపించింది. తాను గర్భం దాల్చినట్లు చెప్పిన మహిళా రాజశేఖర్ తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించడాని తెలిపింది. రాజశేఖర్ వేరే అమ్మాయితో పెళ్లికి సిద్ధమయ్యాడని పేర్కొంది. రాజశేఖర్ పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు చెప్పింది. రాజశేఖర్ పై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని, అరెస్టు కూడా చేశారని వివరించింది. కానీ రాజశేఖర్ కొద్ది రోజులకే బెయిల్ బయటకు వచ్చాడని తెలిపింది. దీంతో ఏం చేయాలో తెలియక ఆత్మహత్యకు యత్నించినట్లు చెప్పింది.
ఆత్మహత్యకు యత్నించిన యువతి
April 24, 2023
0
Tags