ఢిల్లీ పబ్లిక్ స్కూలుకు బాంబు బెదిరింపు !

Telugu Lo Computer
0


న్యూఢిల్లీ మధుర రోడ్డులోని ఢిల్లీ పబ్లిక్ స్కూలుకు బుధవారం బాంబు బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. ఢిల్లీ పబ్లిక్ స్కూలులో బాంబు పెట్టామంటూ ఓ వ్యక్తి పాఠశాలకు ఈమెయిల్ చేశారు. దీంతో అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు హుటాహుటిన బాంబు డిటెక్టివ్ స్క్వాడ్ తో పాటు అంబులెన్స్ లను రంగంలోకి దించారు. అప్రమత్తమైన పోలీసులు ఢిల్లీ పబ్లిక్ స్కూలులో తనిఖీలు చేశారు. తమకు ఎలాంటి బాంబు కనిపించలేదని ఢిల్లీ పోలీసులు చెప్పారు. స్కూలులో ఎలాంటి బాంబు లేకపోవడంతో పోలీసులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. గత నెలలోనూ ఢిల్లీలోని సాధిఖ్ నగర్ ప్రాంత ఇండియన్ స్కూలులో బాంబు పెట్టామంటూ ఓ వ్యక్తి ఈమెయిల్ చేశారు. దీంతో పాఠశాలను వెంటనే ఖాళీ చేయించి బాంబు స్క్వాడ్ ను రంగంలో దించి బాంబుల కోసం వెతికారు. కేవలం బెదిరించేందుకే బాంబు పెట్టామంటూ ఈమెయిల్ చేశారని పోలీసుల దర్యాప్తులో తేలింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)