విదేశీ మార్కెట్‌లో ఆయిల్ ధరలు దిగి రావడంతో దేశీ మార్కెట్‌లో కూడా ఆయిల్ ధరలు తగ్గాయని నివేదికలు పేర్కొంటున్నాయి గ్లోబల్ మార్కెట్‌లో రేట్లు తగ్గడం వల్ల దేశంలోకి తక్కువ ధరకే ఆయిల్ దిగుమతి అవుతోంది. దీని వల్ల వంట నూనె ధరలు దిగి వస్తున్నాయని తెలుస్తోంది. సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ప్రకారం చూస్తే.. నవంబర్ మార్చి కాలంలో వంట నూనె దిగుమతులు వార్షికంగా ఏకంగా 23.7 శాతం మేర పెరిగాయి. 6.98 మిలియన్ టన్నులుగా నమోదు అయ్యాయి. పామ్ ఆయిల్ ధర వార్షికంగా చూస్తే ఏప్రిల్ నెలలో 42 శాతం పడిపోయింది. టన్నుకు 1791 డాలర్ల నుంచి 1030 డాలర్లకు దిగి వచ్చింది. అలాగే క్రూడ్ సోయాబీన్, సన్‌ఫ్లవర్ ఆయిల్ ధరలు కూడా వరుసగా 45 శాతం, 53 శాతం చొప్పున తగ్గాయి. ఇవి వరుసగా టన్నుకు 1040 డాలర్లకు, 1010 డాలర్లకు దిగి వచ్చాయి. ధరల తగ్గుదల నేపథ్యంలో అధిక దిగుమతులు కారణంగా దేశీ మార్కెట్‌లో కూడా మస్టర్డ్, సోయాబాన్ సీడ్ ధరలు తగ్గాయి. దేశంలోని ప్రముఖ ఆయిల్ సమాఖ్య ఎస్ఓపీఏ ప్రకారం చూస్తే.. ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రకారం మస్టర్డ్ ఆయిల్‌ను కొంటోంది. దేశంలో కొన్ని మార్కెట్లలో చూస్తే మస్టర్డ్ ఆయిల్ ధర కనీస మద్దతు ధర కన్నా తక్కువగానే ఉంది. మస్టర్డ్ ఆయిల్ రేటు ఇప్పుడు క్వింటాల్‌కు రూ. 5 వేల నుంచి రూ. 5100 వరకు ఉంది. రూ.5450 మద్దతు ధర కన్నా ఇది తక్కువ. వేరు శనగ నూనె ధర క్వింటాల్‌కు రూ. 6805 నుంచి 6865 వద్ద ఉంది. వేరుశనగ రిఫైన్డ్ ఆయిల్ ధర ధర టిన్‌కు రూ. 2540 నుంచి రూ. 2805గా ఉంది. పామోలిన్ ఎక్స్ కాండ్లా ధర క్వింటాల్‌కు రూ. 9400గా కొనసాగుతోంది. సోయాబీన్ ఆయిల్ డిగుమ్ కాండ్లా ధర క్వింటాల్‌కు రూ. 9 వేలు వద్ద ఉంది. పామోలిన్ ఆర్‌బీడీ క్వింటాల్ ధర రూ. 10,250గా ఉంది. గ్లోబల్ మార్కెట్‌లో రేట్లు తగ్గడం వల్ల ఆ ప్రభావం మన మార్కెట్‌పై పడుతోంది. అందువల్ల రానున్న కాలంలో కూడా వంట నూనె ధరలు తగ్గే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు.
వంట నూనె ధరలు తగ్గే అవకాశం ?
April 23, 2023
0
Tags