లండన్‌లో రూ.250 కోట్లతో జగన్నాథ ఆలయం !

Telugu Lo Computer
0


ఇంగ్లండ్ రాజధాని లండన్‌లో వందల కోట్ల వ్యయంతో ఆలయాన్ని నిర్మిస్తున్నారు. ఓ భక్తుడు కనీవినీ ఎరుగని భారీ విరాళం ప్రకటించాడు. ఒడిశాకు చెందిన బిశ్వనాథ్ పట్నాయక్ అనే ప్రసాస భారతీయుడు ఈ గుడి నిర్మాణ కోసం ఏకంగా రూ.250 కోట్లు ఇస్తున్నట్లు వెల్లడించారు. ఫిన్నెస్ట్ కంపెనీ స్థాపించి కోట్ల ఆర్జించిన పట్నాయక్ గుడి నిర్మాణ కమిటీలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. శ్రీ జగన్నాథ సొసైటీ యూకే పేరుతో ఏర్పడిన ఈ కమిటీ అక్షయ తృతీయ రోజున ఆలయ నిర్మాణ పనులు ప్రారంభించింది. లండన్ శివారులో నిర్మిస్తున్న ఈ ఆలయం వచ్చే ఏడాది చివరికల్లా భక్తులకు అందుబాటులోకి రానుంది. యూరప్ దేశంలో హిందూ భక్తుల సంఘం ఇలాంటి ఆలయాన్ని నిర్మించడం ఇదే తొలిసారి. స్థలం కోసం పట్నాయక్ ఇప్పటికే 15 కోట్లు ఇచ్చారు.

Post a Comment

0Comments

Post a Comment (0)