దేశంలో గడిచిన 24 గంటల్లో 6,050 కేసులు నమోదయ్యాయి. గత 204 రోజుల్లో ఇదే అత్యధికం. గతేడాది సెప్టెంబర్ 16న 6,298 కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా బాధితు సంఖ్య 4,47,51,259కి చేరింది. ఇందులో 5,30,954 మంది మరణించారు. ప్రస్తుతం 31,194 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో 11 మరణాలు నమోదయ్యాయి. కేసుల పెరుగుదల పైన కేంద్రం అప్రమత్తమైంది. రాష్ట్రాలకు తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. కేసుల సంఖ్య పెరుగున్న పరిస్థితుల్లో కేంద్ర కేసుల తీవ్రత పైన ఫోకస్ చేసింది. మొత్తం కేసుల్లో 0.07 శాతం కేసులు యాక్టివ్‌గా ఉండగా, 98.74 శాతం మంది కోలుకున్నారు. 1.19 శాతం మంది మృతిచెందారు. రోజువారీ పాజిటివిటీ రేటు 5.63 శాతానికి పెరిగాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 220.66 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
దేశంలో కొత్తగా 6,155 కరోనా కేసులు నమోదు
April 08, 2023
0
Tags