ఇప్పుడైతే రూ.1000, జూలై నుంచి రూ.10,000 జరిమానా!

Telugu Lo Computer
0


పాన్ కార్డు కలిగిన వారు కచ్చితంగా దాన్ని ఆధార్ కార్డుతో అనుసంధానం చేసుకావాల్సి ఉంటుంది. ఒకవేళ ఇలా చేయకపోతే మాత్రం చాలా సమస్యలు ఎదురవుతాయి. పాన్ కార్డు చెల్లుబాటు కాదు. మీ వద్ద పాన్ కార్డు ఉన్నా కూడా లేనట్లే అవుతుంది. అందుకే పాన్ ఆధార్ కచ్చితంగా లింక్ చేసుకోవాలి. ఒకవేళ ఈ రెండింటినీ లింక్ చేసుకోకపోతే మాత్రం.. జరిమానా, పెనాల్టీ వంటివి పడతాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవలనే పాన్ ఆధార్ లింక్ గడువును పొడిగించింది. మోడీ సర్కార్ ఆధార్ పాన్ కార్డు లింక గడువును 2023 జూన్ 30 వరకు పొడిగించింది. అందువల్ల ఇంకా ఎవరైనా పాన్ ఆధార్ లింక్ చేసుకోని వారు ఉంటే.. వెంటనే ఆ పని పూర్తి చేసుకోవడం ఉత్తమం. లేదంటే సమస్యలు తప్పవు. పాన్ ఆధార్ లింక్ చేసుకోకపోతే మీ పాన్ కార్డు చెల్లుబాటు కాదు. అప్పుడు ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ మీ వద్ద పాన్ కార్డు లేదని పరిగణిస్తుంది. దీని వల్ల చార్జీలు చెల్లించుకోవాల్సి వస్తుంది. భారీగా పెనాల్టీ పడుతుంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 272బీ ప్రకారం చూస్తే.. పాన్ కార్డు సమర్పించకపోతే.. అప్పుడు రూ. 10 వేల జరిమానా పడుతుంది. అంటే మీరు పాన్ ఆధార్ కార్డు లింక్ చేసుకోకపోతే రూ.10 వేల వరకు పెనాల్టీ చెల్లించుకోవాల్సి రావొచ్చు. అయితే ఇప్పుడు పాన్ ఆధార్ కార్డులను లింక్ చేసుకుంటే జరిమానా పడుతుందా? అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. కేంద్ర ప్రభుత్వం ఆధార్ పాన్ లింక్ గడువును పొడిగించినా కూడా మీరు పెనాల్టీ చెల్లించుకోవాల్సి ఉంటుంది. 2022 జూన్ 30 వరకు అయితే పాన్ కార్డు కలిగిన వారు ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవడానికి రూ. 500 జరిమానా ఉండేది. అయితే తర్వాత అంటే 2022 జూలై 1 నుంచి చూస్తే.. ఈ జరిమానా డబుల్ అయ్యింది. రూ. 1000 చెల్లించాలి. అందువల్ల గడువు పొడిగించినా కూడా పెనాల్టీ మాత్రం కట్టాల్సిందే. అంటే మీరు ఇప్పుడు పాన్ కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేసుకోవాలంటే కచ్చితంగా రూ. 1000 చెల్లించాలి. అప్పుడు మీరు ఈ రెండు డాక్యుమెంట్లను లింక్ చేసుకోగలరు. అంటే ఇప్పుడు మీరు రూ. 1000 కట్టి ఆధార్ పాన్ కార్డు లింక్ చేసుకోవాలి. లేదంటే మాత్రం రూ. 10000 జరిమానా పడుతుంది. అందువల్ల వెంటనే పాన్ ఆధార్ కార్డును లింక్ చేసుకోండి. తర్వాత ఇబ్బందులు పడాల్సిన పని ఉండదు.

Post a Comment

0Comments

Post a Comment (0)