ఆంధ్రప్రదేశ్ లో 4 మండలాలకు రెడ్‌ అలర్ట్‌ !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో బుధవారం ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, ప్రధానంగా 4 మండలాలపై తీవ్ర ప్రభావం ఉంటుందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ బీఆర్‌ అంబేద్కర్‌ తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలంలో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. కాకినాడ జిల్లా కోటనందూరు, అనకాపల్లి జిల్లా గొలుగొండ, నాతవరం, మండలాల్లో 42 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండడంతోపాటు తీవ్ర వడగాల్పులు వీస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించినట్లు తెలిపారు. 126 మండలాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటతాయని, వడగాలుల ప్రభావం ఉంటుందన్నారు. కాగా, మంగళవారం అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలంలో అత్యధికంగా 42.9 డిగ్రీలు, అనకాపల్లి మండల కేంద్రం, కోటవురట్లలో 42.4 డిగ్రీలు, మాకవరపాలెంలో 42.5, కాకినాడ జిల్లా తొండంగిలో 41.8, తునిలో 41.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)