బెంగళూరులోని ఇందిరానగర్ మెట్రోస్టేషన్ వద్ద ఓ ఆటో డ్రైవర్ ర్యాపిడో బైక్ ట్యాక్సీ డ్రైవర్‌తో అనుచితంగా ప్రవర్తించాడు. అతడి ఫోన్ లాక్కుని ఆవేశంతో నేలపై కొట్టి సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. ఈ సందర్బంగా ఆటో డ్రైవర్ మాట్లాడుతూ 'మిత్రులారా, అక్రమ ర్యాపిడో వ్యాపారం ఎలా జరుగుతుందో చూడండి. వేరే దేశం నుండి మన దేశానికి వచ్చి రాజు ఇక్కడ బైక్ ట్యాక్సీ నడుపుకుంటున్నాడు. ఇలాంటి వారి కారణంగా మాకు వ్యాపారం లేకుండా పోయింది. వేరే దేశానికి చెందిన అతడు వైట్ నంబర్ ప్లేట్ బోర్ట్ (ఎల్లో కలర్ ట్యాక్సీ నంబర్ ప్లేట్ కాకుండా) ఉన్నప్పటికీ ఒక అమ్మాయిని తీసుకెళ్లడానికి వచ్చాడు' అంటూ సీరియస్ అయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై బైకర్ పోలీసుల ఫిర్యాదు చేయనప్పటికీ వీడియో ఆధారంగా పోలీసులు దీనిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకుని విచారణ చేపట్టినట్టు తెలిపారు. సదరు ఆటోడ్రైవర్ కోసం గాలిస్తున్నట్టు చెప్పారు. అతడిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్టు స్పష్టం చేశారు.
విదేశీయుడుపై ఆటో డ్రైవర్ అనుచిత ప్రవర్తన !
March 08, 2023
0
Tags