ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్, బ్యాంక్ యూనియన్ల మధ్య ఫిబ్రవరి 28న కీలక సమావేశం జరిగింది. బ్యాంక్ ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పని అంశంపై ఈ మీటింగ్‌లో చర్చలు జరిగాయి. బ్యాంక్ యూనియన్స్ చాలా కాలం నుంచి ఈ డిమాండ్ చేస్తూ వస్తోంది. అయితే ఇప్పుడు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ఈ వారానికి ఐదు రోజుల పని ప్రతిపాదనకు అంగీకారం తెలియజేసినట్లు తెలుస్తోంది. రోజుకు 40 నిమిషాలు ఎక్కువగా పని చేయాల్సి ఉంది. బ్యాంకులు రానున్న రోజులలో ఇకపై ఉదయం 10 గంటలకు తెరుచుకోనున్నాయి. సాయంత్రం 4 గంటల వరకు బ్యాంకులు తెరిచే ఉంటాయి. క్యాష్ ట్రాన్సాక్షన్లకు ఇది వర్తిస్తుంది. అదే నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్లు అయితే సాయంత్రం 4.30 గంటల వరకు కూడా బ్యాంకుల పని చేయాల్సిందే. ఈ వారానికి ఐదు రోజుల పని, పని గంటల పెంపు అంశాలకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రాతిపాదనకు ఆర్థిక శాఖ అనుమతి కూడా కావాల్సి ఉంటుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ అనుమతి తర్వాత చివరిగా దేశీ కేంద్ర బ్యాంక్ అయిన రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి కూడా కావాల్సి ఉంది. ఆర్థిక శాఖ, ఆర్బీఐ అనుమతి తర్వాతనే కొత్త మార్పులు అమలులోకి వస్తాయి. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్, బ్యాంక్ యూనియన్ల మధ్య జరిగిన మీటింగ్‌లో పెన్షన్ పెంపు అంశంపై కూడా చర్చలు జరిగాయి. 2017 అక్టోబర్ వరకు పదవీ విరమణ చేసిన వారికి తక్కువ పెన్షన్ వస్తోందని, దీన్ని పెంచాలని బ్యాంక్ యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. ఈ అంశంపై ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ఎలాంటి హామీ ఇవ్వలేదు. ఈ అంశంపై మరింత చర్చించాల్సి ఉందని పేర్కొంది. అలాగే కొత్త పెన్షన్ స్కీమ్ నుంచి ఉద్యోగులు అందరినీ పాత పెన్షన్ స్కీమ్‌కు మార్చాలని కూడా బ్యాంక్ యూనియన్లు డిమాండ్ చేశాయి. అయితే దీనికి కూడా ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ఎలాంటి హామీ ఇవ్వలేదు. తర్వాత వేతన సవరణ సమయంలో ఈ అంశాలను పరిశీలిస్తామని పేర్కొంది.
బ్యాంకుల పని దినాల్లో మార్పులు ?
March 08, 2023
0
Tags