తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబాన్ని మోడీ సర్కార్ టార్గెట్ చేసినట్లు ఎంపీ అసదుద్దీన్ ఆరోపించారు. ఈ విషయం తన ట్విట్టర్‌లో ఇవాళ ఆయన ఓ ట్వీట్ చేశారు. దేశంలోని ముస్లింలను ఆర్థికంగా వెలివేసేందుకు బీజేపీ ఎంపీలు ప్రయత్నిస్తున్నట్లు ఆరోపించారు. ముస్లింలను ఎదుర్కొనేందుకు ప్రజలు తమ ఇండ్లల్లో ఆయుధాలు పెట్టుకోవాలని పిలుపునిచ్చినట్లు ఆరోపించారు. మరో వైపు బీజేపీ ప్రభుత్వం నీచ రాజకీయాలకు పాల్పడుతున్నట్లు ఆయన విమర్శించారు. తెలంగాణ సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్ కుటుంబాన్ని కక్ష్య సాధింపు ఉద్దేశంతోనే మోదీ సర్కార్ టార్గెట్ చేసినట్లు ఎంపీ అసద్ తన ట్వీట్‌లో ఆరోపించారు.
కేసీఆర్ ఫ్యామిలీని మోడీ టార్గెట్ చేశారు !
March 11, 2023
0
Tags