బెంగళూరు-మైసూరు నగరాల మధ్య రూ.8,478 కోట్లతో నిర్మించిన జాతీయ రహదారి 275 ని ప్రధాని మోదీ ఆదివారం ప్రారంభించనున్నారు. భారతమాల పరియోజన పథకంలో భాగంగా 118 కి.మీ. మేర నిర్మించిన ఈ మార్గంలో ఆరు వరసల ప్రధాన రహదారితోపాటు ఇరువైపులా నాలుగు వరుసల సర్వీసు రోడ్డు ఉంది. ఈ ఉభయ నగరాల మధ్య 155 కి.మీ. దూరం కాగా వీటి శివార్ల మధ్య ఉన్న 118 కి.మీ. దూరానికి రాష్ట్ర ప్రభుత్వం భూమిని సమకూర్చగా, జాతీయ రహదారుల అభివృద్ధి ప్రాధికార సంస్థ నిర్మాణ పనులు చేపట్టింది. ఇప్పటి వరకు ఈ రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం మూడు గంటలు కాగా, ఈ రహదారి నిర్మాణంతో అది 90 నిమిషాలకు తగ్గనుంది. అవసరానికి అనుగుణంగా ఈ రహదారిపై హెలికాప్టర్లను కూడా దింపవచ్చని అధికారులు తెలిపారు. మధ్యలో వచ్చే నగరాలు, పట్టణాలకు వెళ్లేందుకు ఎగ్జిట్ మార్గాలు ఉన్నాయి. ఈ రహదారిలో 40 చిన్న వంతెనలు, 89 అండర్‌పాస్, ఓవర్‌పాస్‌లు ఉన్నాయి.
బెంగళూరు-మైసూరు మధ్య పది వరసల మార్గం !
March 11, 2023
0
Tags