సుకన్య సమృద్ధి యోజన పేరుతో ఆడపిల్లల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న చిన్న పొదుపు పథకం. ఈ పథకానికి ఇప్పటికీ ఆదారణ లభిస్తోంది. ఆడపిల్లల చదువు నుంచి పెళ్లి వరకు తల్లిదండ్రులకు ఆందోళనను దూరం చేసే ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి పెట్టుబడిదారుల ఫేవరెట్ లిస్టులో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ పథకం కింద ఇప్పటి వరకు దాదాపు 3 కోట్ల ఖాతాలు తెరవగా, గత రెండు రెండు రోజుల్లోనే పది లక్షలకు పైగా ఖాతాలు తెరిచారంటే దీన్ని బట్టి ఈ స్కీమ్ కు ఎంత ఆదరణ ఉందో అంచనా వేయవచ్చు. స్వాతంత్ర్య అమృత్ మహోత్సవం, అమృత్ కాల ప్రారంభం సందర్బంగా పొదుపు పథకాలకు సంబంధించి 2023ఫిబ్రవరి 1నుంచి ఫిబ్రవరి 8 వరకు పోస్టాఫీసు ప్రారంభించిన ప్రత్యేక అవగాహన ప్రచారానికి ప్రధానమంత్రి మోదీ అభినందనలు తెలిపారు. దీనికి అద్భుతమైన స్పందన వచ్చింది. రెండు రోజుల్లోనే పది లక్షలకు పైగా సుకన్య సమృద్ధి ఖాతాలు తెరిచారు. ఈ ఘనతసాధించినందుకు పోస్టల్ శాఖను ప్రధాని మోదీ స్వయంగా ట్వీట్ ద్వారా అభినందించారు. ప్రధాని మోదీ చేసిన ఈ ట్వీట్ ఈ గొప్ప విజయానికి @indiapostofficeకి అభినందనలు. ఈ ప్రయత్నం దేశ ఆడపిల్లల భవిష్యత్తుకు భద్రత కలిపిస్తుంది. వారిని శక్తివంతంగా మారుస్తుందంటూ ట్వీట్ చేశారు.
ఆదరణ తగ్గని సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ !
February 14, 2023
0
Tags