అమెరికాలోని మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీలో దుండగుడు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు మృతి చెందగా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. యూనివర్శిటీ క్యాంపస్లో రెండు చోట్ల దుండగుడు కాల్పులు జరిపాడు. కాల్పులు తరువాత దుండగుడు పారిపోయారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం మిచిగాన్ యూనివర్సిటీలో 50 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. విద్యార్థులు సురక్షిత ప్రాంతాల్లో ఉంచాలని అధికారులు సూచన చేస్తున్నారు. మిచిగాన్ యూనివర్సిటీలో 48 గంటల పాటు కార్యకలాపాలు రద్దు చేశారు. మృతి చెందిన విద్యార్థుల వివరాలు తెలియాల్సి ఉంది.
అమెరికా కాల్పుల్లో ముగ్గురు విద్యార్థులు మృతి
February 14, 2023
0
Tags