మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కమల్నాథ్, మూఢనమ్మకాలను వ్యాప్తి చేయడమే కాకుండా, వివాదాస్పద వ్యాఖ్యలతో అశాంతికి కారణమవుతున్నారనే విమర్శలను ఎదుర్కొంటున్న బాబా ధీరేంద్ర కృష్ణ శాస్త్రి కలుసుకోవడం చర్చనీయాంశం అవుతోంది. భాగేశ్వర్ ధాం వెళ్లి మరి బాబా ధీరేంద్ర కృష్ణ శాస్త్రిని కలుసుకోవడం గమనార్హం. భారతీయ జనతా పార్టీని ఇరుకున పెట్టాలని కాంగ్రెస్ పార్టీ అనుకున్న ప్రతీసారీ కమల్నాథ్ అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. రామమందిరం విషయంలో కూడా ఇదే జరిగింది. రామమందిరం పూర్తి క్రెడిట్ బీజేపీ తీసుకుని కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టింది. ఏమీ తోచలేని స్థితిలో కాంగ్రెస్ ఉంటే.. కమల్నాథ్ మాత్రం రామాలయ శంకుస్థాపనకు వెళ్లారు. ఇక పలు సందర్భాల్లో ఇదే జరిగింది. ఇక ధీరేంద్ర శాస్త్రి మీద విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ సమయంలో కమల్నాథ్ బాగేశ్వర్ ధామ్ బయల్దేరడం కాంగ్రెస్ వర్గాల్లో అసంతృప్తిని రేకెత్తిస్తోందని సమాచారం.
వివాదాస్పద బాబా ధీరేంద్ర కృష్ణ శాస్త్రిని కలుసుకున్న కమల్నాథ్ !
February 14, 2023
0
Tags