మందుబాబులకు ఇంపోజిషన్ శిక్ష !

Telugu Lo Computer
0


కేరళ పోలీసులు మందుబాబులకు వింత శిక్ష విధించారు. మందుబాబులను స్టేషన్‌లో కూర్చోబెట్టి ఇంపోజిషన్ రాయించారు. ఆదివారం రోజున కొచ్చిలో ఓ ప్రైవేటు బస్సు ఢీ కొట్టడంతో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. కేరళ హైకోర్టు జోక్యం చేసుకుని మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అప్రమత్తమైన పోలీసులు సోమవారం తనీఖీలు చేపట్టారు. ఈ క్రమంలో పట్టుబడిన మందుబాబులను త్రిపునితుర పోలీస్ స్టేషన్‌కు తరలించి  వింత శిక్ష విధించారు. "ఇకపై తాగి డ్రైవింగ్ చేయను" అని మందుబాబులతో 1000 సార్లు రాయించారు. చేసేది లేక మందుబాబులంతా పోలీస్ స్టేషన్‌లో నేల మీద కూర్పోని ఇంపోజిషన్ రాశారు. ఇంపోజిషన్ రాసినప్పటికి అసలు శిక్ష తప్పదని పోలీసులు తెలిపారు. మోటారు వాహన చట్టం కింద కేసులు నమోదు చేసి వారి లైసెన్సులు సస్పెండ్ చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)