కర్ణాటకలోని కొడగు జిల్లా పొన్నంపేట తాలూకాలో కుట్ట సమీపంలోని పల్లేరి గ్రామం కాఫీతోటలో ఇంటి ముందు ఆడుకుంటున్న చేతన్ (12) అనే బాలుడిపై ఆదివారం రాత్రి పులి దాడి చేసింది. దాడిలో బాలుడు అక్కడికక్కడే మరణించాడు. మనవడి మృతి వార్త తెలిసి సమీపంలోని గ్రామం నుంచి పల్లేరికి వస్తున్న తాత రాజు (70)పై కూడా సోమవారం ఉదయం పులి దాడి చేసింది. దీంతో ఆయన ఘటనాస్థలంలోనే తుదిశ్వాస విడిచారు. స్థానికుల ఫిర్యాదుతో కుట్ట, పల్లేరి గ్రామాల చుట్టూ అధికారులు బోనులను ఏర్పాటు చేశారు. ఒంటరిగా ఎవరూ పొలాల్లోకి వెళ్లవద్దని అధికారులు సూచించారు.
పులి దాడిలో ఇద్దరి మృతి
February 14, 2023
0