జస్టిస్‌ రాజేశ్‌, జస్టిస్‌ అరవింద్‌ ప్రమాణస్వీకారం

Telugu Lo Computer
0


సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్‌ రాజేశ్‌ బిందాల్‌, జస్టిస్‌ అరవింద్‌ కుమార్‌లు సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. సుప్రీంకోర్టు ఆవరణలో జరిగిన కార్యక్రమంలో ఇద్దరు న్యాయమూర్తులతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ ప్రమాణం చేయించారు. దీంతో అత్యున్నత న్యాయస్థానంలో న్యాయమూర్తుల సంఖ్య తొమ్మిది నెలల వ్యవధి తర్వాత పూర్తిస్థాయికి (34) చేరింది. ఇప్పటివరకు జస్టిస్‌ రాజేశ్‌ బిందాల్‌ అలహాబాద్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, జస్టిస్‌ అరవింద్‌ కుమార్‌ గుజరాత్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించారు.  

Post a Comment

0Comments

Post a Comment (0)