2025 నాటికి అందుబాటులోకి 220 విమానాశ్రయాలు

Telugu Lo Computer
0


దేశంలో 2025లోపు 220 విమానాశ్రయాలను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నామని కేంద్ర పర్యాటక శాఖమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. పౌర విమానయాన రంగ ప్రోత్సాహానికి కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని చెప్పారు. గతంలో 74 విమానాశ్రయాలు పని చేసేవని, వాటి సంఖ్య 147కు పెంచామని మంత్రి వెల్లడించారు. విమానయాన రంగంలో భారత్‌ సాధించిన అభివృద్ధి, తీసుకున్న కీలక నిర్ణయాలపై దిల్లీలో సోమవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ ఏడాది దేశంలో విమాన ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని భావిస్తున్నామని, జీ-20 సమావేశాలు, ఇతర కారకాలే ఇందుకు కారణమని చెప్పారు. 2014లో దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య ఆరు కోట్లుగా ఉంటే 2020 వచ్చేసరికి ఆ సంఖ్య 14.3 కోట్లకు పెరిగిందన్నారు. ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగా అప్పర్‌ ఎయిర్‌ స్పేస్‌ను వాణిజ్య వినియోగానికి కేటాయించేందుకు, 119 మార్గాలకు సంబంధించి రక్షణ శాఖ అనుమతి ఇచ్చిందని ఆయన తెలిపారు. ఫలితంగా విమానయాన సంస్థలకు ఏడాదికి రూ.వెయ్యి కోట్లు ఆదా అవుతోందన్నారు. సామాన్యులు విమాన ప్రయాణం చేయాలన్న ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఉడాన్‌ పథకం కింద రూ.2,360 కోట్లను కేంద్రం వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌గా అందించిందని మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)