మహారాష్ట్ర నూతన గవర్నర్‌గా పంజాబ్ మాజీ సీఎం, బీజేపీ నేత కెప్టెన్ అమరీందర్ సింగ్ ను నియమించాలని ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. సుదీర్ఘ కాలంపాటు కాంగ్రెస్‌లో కొనసాగిన అమరీందర్ సింగ్ గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ను వీడి పంజాబ్ లోక్ కాంగ్రెస్ అనే కొత్త పార్టీని స్థాపించారు. ఆ ఎన్నికల్లో అమరీందర్ సింగ్ తో పాటుగా ఆయన పార్టీ కూడా ఘోరంగా ఓడిపోయింది. అనంతరం బీజేపీలో చేరిన ఆయన తన పార్టీని కూడా బీజేపీలో వీలినం చేశారు. మరోవైపు మహారాష్ట్ర గవర్నర్‌గా సెప్టెంబర్ 2019లో బాధ్యతలు చేపట్టిన కోశ్యారీ అనేక వివాదాల్లో చిక్కుకున్నారు. ఛత్రపతి శివాజీపై ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద దూమారాన్ని లేపాయి. ఈ నేపథ్యంలో కోశ్యారీ రాజీనామా ప్రకటించారు.
భగత్‌సింగ్ కోశ్యారీ స్థానంలో అమరీందర్ సింగ్ ?
January 27, 2023
0