ప్రాణాల మీదకి తెచ్చిన సరదా !

Telugu Lo Computer
0


మహారాష్ట్రకు చెందిన రాజు అనే 26 ఏళ్ల వ్యక్తి బతుకు దెరువుకోసం హైదరాబాద్ నగరానికి వచ్చి చిన్న చిన్న పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అలా సోమవారం సాయంత్రం తిరుమలగిరి కెన్ కళాశాల సమీపంలోని ఖాళీ ప్రదేశానికి వెళ్లాడు. అక్కడ ఉన్న పెద్ద బండను చూసి సంబరపడి దానిపైకి ఎక్కాడు. పట్టుతప్పి రెండు రాళ్ల మధ్యలోకి పడిపోయాడు. బయటకు రాలేక కేకలు వేశాడు. స్థానికులు గుర్తించి తిరుమలగిరి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న తిరుమలగిరి పోలీసులు కానిస్టేబుల్స్ రాంబాబు భాష రాజు ఘటన స్థలానికి చేరుకొని రాజును కాపాడారు. అనంతరం చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అయిన తర్వాత తన స్వగ్రానికి వెళ్తానని రాజు అనడంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పోలీసులు వదిలేశారు. కానిస్టేబుల్, సీఐ శ్రవణ్ కుమార్ కి బాధితుడు ధన్యవాదాలు చెప్పాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)