ప్రయాణికురాలి వీరంగం !

Telugu Lo Computer
0


అబుదాబీ నుంచి ముంబైకి వచ్చిన విస్తారా విమానంలో ఎకానమీ క్లాస్‌ టికెట్ తీసుకున్న ఇటలీకి చెందిన ఒక మహిళ తాను బిజినెస్‌ క్లాసులోనే కూర్చుంటానని పట్టుబట్టింది. విస్తారా విమాన సిబ్బంది ఒప్పుకోకపోవడంతో వారితో గొడవకు దిగి, దాడికి పాల్పడింది. అంతటితో ఆగకుండా విమానంలో అటు ఇటూ అర్ధ నగ్నంగా తిరిగింది. చాలాసార్లు విమాన సిబ్బంది హెచ్చరించినా వినిపించుకోకపోవడంతో కెప్టెన్‌ వార్నింగ్‌ కార్డ్‌ జారీ చేశారు. ఆ తర్వాత సిబ్బంది ఆమెను అదుపులోకి తీసుకుని ముంబై ఎయిర్‌పోర్టు అధికారులకు సమాచారమిచ్చారు. విమానం ల్యాండ్‌ అయిన తర్వాత సదరు మహిళను ముంబై పోలీసులు అరెస్టు చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)