రాజ్యసభ ప్రతిపక్షనేతగా మల్లికార్జున్‌ ఖర్గే రాజీనామా

Telugu Lo Computer
0


కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి జరుగుతున్న ఎన్నికల్లో పోటీ పడుతున్న మల్లికార్జున్‌ ఖర్గే రాజ్యసభలో ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేశారు. దీనికి సంబంధించి నిన్నతన రాజీనామా లేఖను కాంగ్రెస్‌ తాత్కాలిక అధ్యక్షులు సోనియా గాంధీకి సమర్పించారు. తాను పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేస్తుండటంతో రాజ్యసభలో ప్రతిపక్ష పార్టీ నేత పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా అంతకముందు గులాం నబీ ఆజాద్‌ నిర్వహించేవారు. ఆయన రాజ్యసభ సభ్యత్వం ముగిసిన తర్వాత 2021 ఫిబ్రవరిలో ఖర్గే ఈ పదవిని చేపట్టారు. కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి సంబంధించిన ఎన్నికల ఫలితాలను ఈ నెల 19న విడుదలైన తర్వాత మాత్రమే రాజ్యసభలో ప్రతిపక్ష నేత పదవికి ఎంపిక కసరత్తు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

Post a Comment

0Comments

Post a Comment (0)