తమిళనాడు తిరునెల్వేలి జిల్లాలోని కేసవనేరి గ్రామానికి చెందిన ప్రకాశ్ (25), వల్లియమ్మాల్పురానికి చెందిన దివ్య (22) లు ఐదు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ఇరు కుటుంబాలు వారి ప్రేమకి అడ్డుచెప్పలేదు. అంతా సాఫీగా సాగిపోతున్న క్రమంలో ప్రకాశ్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. వెన్నముకకు దెబ్బతగలడంతో రెండు కాళ్లు చచ్చుబడిపోయాయి. దీంతో ప్రకాష్‌తో పెళ్లి వద్దంటూ దివ్య తల్లిదండ్రులు ఆమెకు నచ్చజెప్పేందుకు యత్నించారు. ఎవరు ఎన్ని చెప్పినా అవేమి పట్టించుకోని దివ్య.. సెప్టెంబర్ 20న ప్రకాశ్ ఇంటికి వెళ్లింది. అతడి కుటుంబ సభ్యుల సమయక్షంలో ప్రకాష్-దివ్యలు పెళ్లి చేసుకుని ప్రేమకు ప్రతిరూపంగా నిలిచారు. విషయం తెలుసుకున్న దివ్య తల్లిదండ్రులు సెప్టెంబర్ 29న ప్రకాష్ ఇంటికి వెళ్లి గొడవ పడ్డారు. వారిపై దాడి చేసి దివ్యను బలవంతంగా తీసుకుని వెళ్లిపోయారని ప్రకాష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తమ ఇద్దరిని కలపాలని పోలీసులను వేడుకున్నాడు.
Post a Comment
0Comments
3/related/default