విస్తారా విమాన ఫుడ్‌ ప్యాకెట్‌లో బొద్దింక !

Telugu Lo Computer
0


విస్తారా విమానంలో  ఓ ప్రయాణీకుడికి అందించిన ప్రీ ప్యాక్డ్‌ ఫుడ్‌లో బొద్దింకను చూసి షాక్‌ తిన్నాడు. ఆహారం సగం తిన్న తర్వాత అందులో ఉన్న బొద్దింకను గుర్తించాడు. తనకు ఎదురైన అనుభవాన్ని సోలంకి ట్విట్టర్‌లో షేర్‌ చేయడంతో పాటు ఎయిర్‌లైన్స్‌ను ట్యాగ్‌ చేశాడు. ట్వీట్‌ను గుర్తించిన ఎయిర్‌లైన్స్‌ సోలంకికి బదులిచ్చింది. తాము అత్యధిక నాణ్యతా ప్రమాణాలతో కూడిన ఆహారాన్ని సిద్ధం చేస్తామని పేర్కొంది. మీ విమాన వివరాలను పంపితే తాము ఈ అంశంపై దృష్టిసారించి వీలైనంత త్వరగా పరిస్ధితి చక్కదిద్దుతామని పేర్కొంది. విస్తారా సర్వీస్‌ పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన నెటిజన్లు విమానాలు లేదా ట్రైన్లలో ఆహారంలో పురుగులు రావడం సర్వసాధారణంగా మారిందని కామెంట్‌ సెక్షన్‌లో రాసుకొచ్చారు.

Post a Comment

0Comments

Post a Comment (0)