పెరిగిన అమూల్ పాల ధరలు

Telugu Lo Computer
0


గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్, అమూల్ బ్రాండు పేరుతో దేశవ్యాప్తంగా పాలను విక్రయిస్తోంది. లీటర్ పాల ధరను రూ.2 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఫుల్ క్రీమ్ మిల్క్ ధర లీటర్ కు రూ. 61 నుంచి 63కు పెరగనుంది. గుజరాత్ మినహా అన్ని రాష్ట్రాల్లో  ఫుల్ క్రీమ్ మిల్క్ ధర, గేదె పాల ధరలను లీటర్ కు రూ.2 పెంచుతున్నట్లు ఆ సంస్థ ఎండీ ఆర్ఎస్ సోధి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగబోతున్న గుజరాత్ లో మాత్రం ధరలను పెంచలేదు. దేశంలో మిగతా రాష్ట్రాల్లో పెరిగిన ధరలు అమలులోకి రానున్నాయి. డెయిరీ ఫ్యాట్ ధరల్లో డిమాండ్ పెరగడంతో పాల ధరలను పెంచుతున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. మదర్ డైరీ కూడా పాల సేకరణ ఖర్చుల పెరుగుదలను భర్తీ చేసేందుకు ధరలను పెంచింది.

Post a Comment

0Comments

Post a Comment (0)