అసాంలోని ధుబ్రి జిల్లాలో బ్రహ్మపుత్ర నదిలో ప్రయాణికులతో వెళ్తున్న పడవ గురువారం మధ్యాహ్నం బోల్తా పడడంతో ప్రభుత్వ అధికారి, పాఠశాల విద్యార్థులు సహా పలువురు గల్లంతయ్యారు. ఆ సమయంలో పడవలో సుమారు 100 మంది దాకా ప్రయాణికులు ఉన్నారని, 10 మోటార్ సైకిళ్లను అందులో ఎక్కించారని స్థానికులు పేర్కొన్నారు. వాటి బరువుకు అది మునిగి ఉంటుందని స్థానికులు వెల్లడిస్తున్నారు. ధుబ్రి పట్టణానికి 3 కి.మీ దూరంలో ఉన్న అడబారి వద్ద బ్రిడ్జి పోస్ట్‌ను ఢీకొని భాషాని వెళ్తున్న పడవ బోల్తా పడిందని, ఇప్పటి వరకు 15 మందిని రక్షించినట్లు అధికారి తెలిపారు. పడవలో చాలా మంది విద్యార్థులు ఉన్నారని, ఎవరినీ రక్షించలేదని చెప్పారు. కోతకు గురైన ప్రాంతాన్ని సర్వే చేసేందుకు వెళ్లిన ధుబ్రీ సర్కిల్ అధికారి సంజు దాస్, ల్యాండ్ రికార్డ్ అధికారి, కార్యాలయ సిబ్బంది కూడా ఆ పడవలో ఉన్నారని చెప్పారు. సంజుదాస్ ఆచూకీ తెలియలేదని, మిగిలిన ఇద్దరు అధికారులు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారని అన్నారు. స్థానికులు కూడా సహాయక చర్యలు చేపట్టారని, రాష్ట్ర విపత్తు నిర్వాహక కమిటీ (ఎస్‌డిఆర్‌ఎఫ్ ) నుండి డైవర్లను కూడా మోహరించినట్లు గౌహతిలోని మరో అధికారి తెలిపారు.
అస్సాంలో పడవ బోల్తా !
September 29, 2022
0