శ్రీశైలంలో సత్రాలపై దేవస్థానానిదే అజమాయిషీ !

Telugu Lo Computer
0


శ్రీశైల దేవస్థాన పరిధిలోని వివిధ కులాల సత్రాలపై దేవస్థానం పర్యవేక్షణ ఉండేలా ఓ విధానం తెచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని  దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు.  రూముల కేటాయింపులు మొదలుకుని సత్రాలల్లో అందించే సేవల వివరాలను దేవస్థానానికి తెలిపేలా చర్యలు తీసుకుంటామని, రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి సౌకర్యాలను దేవస్ఖానమే కల్పిస్తోందన్నారు. ఆ మేరకు సత్రాలపై దేవస్థానం పర్యవేక్షణ ఉండాలని భావిస్తున్నాం. బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడుకు ఎలాంటి అవమానం జరగలేదన్నారు. ఓ ఎమ్మెల్యే లోపల దర్శనం చేసుకుంటున్నారని ముత్యాల నాయుడు కాసేపు ఆగారు. అద్భుతమైన దర్శనం జరిగిందని బూడి ముత్యాల నాయుడు నాతో చెప్పారు. శ్రీశైలం దేవస్థానం పరిధిలో అభివృద్ది చేయాలంటే అటవీ శాఖ నుంచి కొన్ని ఇబ్బందులు వస్తున్నాయని, శ్రీశైలం అభివృద్ధికి అటవీ, రెవెన్యూ శాఖల నుంచి వచ్చే ఇబ్బందుల పరిష్కారంపై మంత్రులు పెద్దిరెడ్డి, ధర్మానతో సమావేశం అయ్యామని, శ్రీశైలం దేవస్థానం నుంచి ఏడు చదరపు మైళ్ల మేర భూమిని దేవస్థానానికి కేటాయిమని,  ఇది దాదాపు 4130 ఎకరాల భూమి ఏడు చదరపు మైళ్ల పరిధిలో ఉంటుందని,  అలాగే ఇంకొంత భూమిని వివిధ జీవోల ద్వారా భూమిని దేవస్థానానికి కేటాయించామని, అయితే సరిహద్దులు ఫిక్స్ చేయకపోవడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయన్నారు. గతంలోని జీవోల ప్రకారం బౌండరీలు ఫిక్స్ చేయడానికి నిర్ణయించాం. అక్టోబర్ నెలాఖరు నాటికి బౌండరీలు ఫిక్స్ చేయనున్నాం అని చెప్పారు. దేవస్థానం అభివృద్ధికి సంబంధించి ఎంత భూమి కావాలో నిర్ధారించుకుంటాం. అలాగే ఎకో టూరిజం, రెలిజియస్ టూరిజం అభివృద్ధి చేస్తాం అన్నారు. వైల్డ్ లైఫ్ శాంక్చురీకి, రిజర్వ్ ఫారెస్టుకు ఇబ్బంది కలగకుండా శ్రీశైల దేవస్థాన అభివృద్ధి చేపడతాం. శ్రీశైల దేవస్థానాన్ని.. దేవస్థాన పరిధిలోని భూభాగాన్ని కాంక్రీట్ జంగిల్ చేయాలనేది మా ఉద్దేశ్యం కాదన్నారు. దేవస్థాన అభివృద్ధికి అటవీ భూమి అవసరమైతే.. రెండింతల మేర దేవస్థాన భూమిని అటవీ శాఖకు బదలాయించే నిబంధన పైన చర్చిస్తున్నాం అని వివరించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)