ఎల్పీజీ సిలిండర్లపై కేంద్రం పరిమితి విధించింది. ఇక నుంచి వినియోగదారులకు ఏడాదికి 15, నెలకు 2 సిలిండర్లు మాత్రమే కొనుగోలు చేయగలరు. అంతకు మించి సిలిండర్లు కొనుగోలు చేస్తే సబ్సిడీ లభించదు. 15 కంటే ఎక్కువ సిలిండర్లు కావాలంటే అందుకు స్పష్టమైన కారణం చెప్పాల్సి ఉంటుంది. అందుకు సంబంధించిన ఆధారాలను సంబంధిత గ్యాస్ కంపెనీలకు సమర్పించాల్సి ఉంటుంది. నేచురల్ గ్యాస్ ధరలను కేంద్ర సర్కార్ పెంచేసింది. పవర్ జనరేషన్, ఎరువుల తయారీకి వినియోగించే నేచురల్ గ్యాస్ ధరలను కేంద్ర సర్కార్ 40 శాతం మేర పెంచింది. పెరిగిన ధరలు అక్టోబర్ 1 నుంచి వచ్చే ఆరు నెలల వరకు అమలులో ఉంటాయని పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలసిస్ సెల్ ప్రకటించింది. సీఎన్జీ వాహనాలు, ఇళ్లలో వంట కోసం వాడే పైప్ లైన్ గ్యాస్ లో నేచరల్ గ్యాస్ ను వినియోగిస్తారు. ధరల పెంపుతో సీఎన్జీ వాహనదారులకు భారం కానుంది.
ఎల్పీజీ సిలిండర్లపై పరిమితి విధింపు !
October 01, 2022
0