పవన్ మూడో భార్య " అన్నాలెజ్‌నోవా " ఆస్తులు !

Telugu Lo Computer
0


పవన్ ముందుగా వైజాగ్‌కు చెందిన నందిని అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. సినిమాల్లోకి రాకముందే చిరంజీవి స్వయంగా ఈ పెళ్లి జరిపించారు. యేడాదికే వీరి మధ్య మనస్పర్థలు రావడంతో దూరమైపోయారు. ఆ తర్వాత తనతో బద్రి, జానీ సినిమాల్లో నటించిన హీరోయిన్ రేణుదేశాయ్‌ను రెండో భార్యగా స్వీకరించారు. ప్రజారాజ్యం పార్టీ టైంలో ఆమె మొడలో మూడు ముళ్లు వేసి భార్యగా స్వీకరించినా అనంతరం కొద్ది కాలానికే పవన్ - రేణు విడిపోయారు. పవన్ - రేణు దంపతులకు ఇద్దరు పిల్లలు. ఆ తర్వాత తీన్‌మార్ సినిమా టైంలో రష్యన్ మోడల్ అయిన అన్నా లెజ్‌నోవాతో పవన్‌కు ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారింది. చివరకు వీరు పెళ్లి చేసుకున్నారు. 2011 తీన్‌మార్ సినిమా టైం నుంచే పవన్ లెజ్‌నోవా మధ్య సహజీవనం స్టార్ట్ అయ్యింది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుమారుడు పేరు మార్క్ శంకర్ పవనోవిచ్ కాగా.. కుమార్తె పేరు పోలెనా అంజనా పవనోగా పెట్టుకున్నారు. లెజ్‌నోవా పెళ్లికి ముందు నుంచే మోడల్‌గా, హీరోయిన్‌గా ఉండేది. ఆమె క్రిస్టియన్ సంప్రదాయానికి చెందిన మహిళ అయినా పవన్ భార్య అయ్యాక పూర్తిగా హిందూ సంప్రదాయంలోకి మారిపోయి తన కట్టు, బొట్టుతో సరికొత్తగా దర్శనమిస్తోంది. ఆమె పాపులర్ నటుడు, స్టార్ హీరో భార్య అయినా కూడా సోషల్ మీడియాకు మాత్రం ఎప్పుడూ దూరంగానే ఉంటూ వస్తున్నారు. లెజ్‌నోవా ఆస్తుల గురించి ఇప్పుడు హాట్ డిస్కర్షన్ నడుస్తోంది. ఆమె పేరిటే ఏకంగా రు. 1600 కోట్ల పైచిలుకు ఆస్తులు ఉన్నాయట. ఆమె పేరిట ఇన్ని కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయన్న సందేహాలు చాలానే ఉన్నాయి. అయితే 2011 నుంచి పవన్ కొన్ని ఆస్తులను ఆమె పేరిట కొంటూ వచ్చారు. అయితే రష్యాలో ఆమె మెడల్‌, నటిగా ఉన్నప్పుడు కొన్ని ఆస్తులను సంపాదించుకున్నారు. పవన్ మాత్రం ఆమె పేరిట సింగపూర్‌లో కోట్లాది రూపాయల ఆస్తులు కొని రిజిస్టర్ చేయించాడట. 11 - 12 ఏళ్ల కాలంలో ప్రతి యేటా పవన్ కొన్ని ఆస్తులను లెజ్‌నోవా పేరిట కొంటూ రావడంతో వాటి విలువ విపరీతంగా పెరిగిపోయిందట. సింగపూర్‌లో ఉన్న ఆస్తుల విలువే కోట్లలో ఉంటుందని చెపుతున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)