ఆంధ్రప్రదేశ్ లోని అరకులోయ మండలం మాడగడ గ్రామంలో గడపగపడకూ మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తోన్న ఎమ్మెల్యే ఫాల్గుణను ఓ మహిళ అడ్డుకుంది. మెడలో ఉన్న కండువాను పట్టుకుని తమ స్థలాన్ని అక్రమంగా ఆక్రమించుకున్నారంటూ ప్రశ్నించింది. మహిళతోపాటు ఆమె కుటుంబ సభ్యులు కూడా ఎమ్మెల్యే ఫాల్గుణతో వాగ్వాదానికి దిగారు. మహిళ ఏకంగా ఎమ్మెల్యే మెడ పట్టుకున్నంత పనిచేయడంతో అక్కడున్న వాళ్లంతా అవాక్కయ్యారు. అయితే, తాను ఎమ్మెల్యే కాకముందు ఆ స్థలాన్ని కొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నానని చెట్టి ఫాల్గుణ చెబుతున్నారు. తన దగ్గర అన్నీ ఆధారాలు ఉన్నాయంటున్నారు ఎమ్మెల్యే. కలెక్టర్, రెవెన్యూ అధికారులు కూడా ఎంక్వైరీ చేసి రిపోర్ట్ కూడా ఇచ్చారని, ఇప్పుడు భూమి ధర పెరగడంతో రాద్ధాంతం చేస్తున్నారని చెట్టి ఫాల్గుణ అంటున్నారు.
ఎమ్మెల్యేకు చేదు అనుభవం !
June 16, 2022
0