మద్యం దుకాణంపై పేడ విసిరిన ఉమా భారతి

Telugu Lo Computer
0


మధ్యప్రదేశ్‌లోని నివారీ జిల్లా ఓర్చా పట్టణంలో మద్యపానాన్ని నిషేధించాలంటూ ఓ మద్యం దుకాణంపై మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ ఎంపీ  ఉమా భారతి ఆవు పేడ విసిరారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరలైంది. 'పేడ విసరడమే కాదు, దుకాణంపైకి రాళ్లు కూడా రువ్వుతున్నా'నని వీడియో తీస్తున్న వ్యక్తితో ఉమాభారతి అంటూ కన్పించారు. దాంతో దుకాణాన్ని యజమాని తాత్కాలికంగా మూసేశాడు. గతంలోనూ ఉమాభారతి భోపాల్లోని ఓ మద్యం దుకాణంలోకి వెళ్లి బాటిళ్లపై రాళ్లు విసిరి పగలగొట్టడం తెలిసిందే.

Post a Comment

0Comments

Post a Comment (0)