వెంకయ్యనాయుడితో విజయసాయి రెడ్డి భేటీ !

Telugu Lo Computer
0


రాష్ట్రపతి ఎన్నికల వేళ వెంకయ్య నాయుడితో జగన్ సన్నిహితుడైన సాయి రెడ్డి భేటీ కావడం చర్చగా మారింది. రాష్ట్రపతి ఎన్నికలపై చర్చ జరిగిందనే ప్రచారం జరుగుతోంది. అయితే విజయసాయి రెడ్డి మాత్రం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని, కామర్స్ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్​ హోదాలోనే కలిసినట్లు తెలిపారు. కామర్స్‌ స్థాయి సంఘం నివేదికలను సమర్పించానని తెలిపారు. వెంకయ్యతో సమావేశం తర్వాత మాట్లాడిన సాయి రెడ్డి.. రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ మద్దతు ఎవరికి అనేది సీఎం జగన్ నిర్ణయిస్తారని చెప్పారు. మమతా బెనర్జీ నుంచి తమకు పిలుపు రాలేదని చెప్పారు. ప్రతిపక్షాలు ప్రెసిడెంట్ ఎన్నికల్లో బరిలో ఉంటాయో లేదో తనకు తెలియదన్నారు. వైసీపీ మాత్రం బీజేపీతోనే ఉంటుందనే సంకేతం ఇచ్చారు.

Post a Comment

0Comments

Post a Comment (0)